పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోంది : మాజీమంత్రి ప్రత్తిపాటి.
ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసనీయత, నిబద్ధతే ఏపీకి బలం : ప్రత్తిపాటి.
ఉత్తమ విద్యాబోధనతో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నదే లోకేశ్ తాపత్రయం. : ప్రత్తిపాటి
విద్యార్థులు గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించి, జీవితంలో బాగా రాణించాలి : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
యడ్లపాడు మండలం సొలసలో పలు అభివృద్ధి పనులు, డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు
చిలకలూరిపేట అక్టోబర్ 22(పల్నాడుఅప్డేట్స్ )
విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరి కోసం ఉద్యోగాలు ఎదురుచూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గ్రామస్తులతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో రూ.40లక్షలతో నిర్మించిన కల్వర్టు, పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్లను ప్రారంభించిన అనంతరం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్నాడు డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన నేతలు... ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
కూటమిప్రభుత్వ సుస్థిర పాలన.. చంద్రబాబు విశ్వసనీయత..సమర్థత వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు.
దేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు, కంపెనీల యజమానులకు ముందుగా నేడు రాష్ట్రమే గుర్తొస్తోందని, అందుకు కారణం కూటమిప్రభుత్వ సుస్థిర పాలన, పారదర్శక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కారణమని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజల సంతోషం.. రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకం, విశ్వసనీయత, నిబద్ధత వల్లే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పల్లెల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 13వేలకు పైగా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, పల్లెపండుగకు శ్రీకారం చుట్టారని ప్రత్తిపాటి చెప్పారు.ఉత్తమ విద్యాబోధనతో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నదే లోకేశ్ తాపత్రయం.గత పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా నిర్వీర్యమైన రాష్ట్ర విద్యారంగాన్ని తన సమర్థత.. ఆలోచనా విధానంతో లోకేశ్ సరిదిద్దుతున్నాడన్నారు. సకాలంలో పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్నభోజనం, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకంతో విద్యార్థులు ఉత్తమ విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు పొంది ఉన్నత స్థానాలకు లోకేశ్ తాపత్రయమన్నారు. రైతు, పేదకుటుంబాల నుంచి వచ్చిన ప్రతి విద్యార్థికి ఉన్నతమైన భవిష్యత్ అందించాలన్నదే కూటమిప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహాకారాలతో కూటమిప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందని, సంక్షేమ పథకాలు అందించడంలో దేశానికే తలమానికంగా నిలిచిందని ప్రత్తిపాటి చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాల్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఎదగాలి : ఎంపీ లావు
విద్యార్థులు, యువత గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమిని గెలుపుగా మలుచుకోవడంలోనే అసలైన లక్ష్యసాధన ఉంటుందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. జీవితంలో రాణించాలంటే విద్యార్థులు పరిణితితో ఆలోచించాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాల సాధన దిశగా విద్యార్థినీ, విద్యార్థులు ఎదగాలన్నారు. తాము చదువుకుంటేనే తమ జీవితాలు, కుటుంబాలు బాగుంటాయనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. రాష్ట్రంలోని అవకాశాలు, వనరుల సద్వినియోగం కోసం విరివిగా పెట్టుబడులు వస్తున్నాయని, విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తిచేసుకునే నాటికి మంచి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని కృష్ణదేవరాయలు తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, కుర్రా రత్తయ్య, మద్దినేని సుబ్బారావు, పోపురి వెంకయ్య, మద్దూరి శ్రీనివాస రెడ్డి, ముద్దన నాగేశ్వరరావు, జగన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఎమ్మార్వో , ఎంపిడివో, పంచాయతీ డి.ఈ, అధికారులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




