జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వెలుగు సిబ్బంది సమీక్షా సమావేశంలో పాల్గొన్న అడిషనల్ సి ఈ ఓ శ్రీరాములు నాయుడు,అడ్మిన్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి.

 

నరసరావుపేట అక్టోబర్ 22(పల్నాడుఅప్డేట్స్ ):

కోటప్పకొండలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణమండపం నందు వెలుగు ఏ పి ఎం లు, సీసీలకు ప్రాజెక్ట్ ప్రాధాన్యత అంశాల లపై అడిషనల్ సి ఈ ఓ శ్రీరాములు నాయుడు సమీక్ష చేయడం జరిగింది. మన డబ్బులు మన లెక్కలు ప్రతి సంఘం సభ్యులకు అవగాహనా కలిగి ఉండేలా చెయ్యాలి. ప్రతి 10 సంఘాలకు ఓక ఈనారి లను తయారు చెయ్యాలని అదేశించడం జరిగింది.ప్రభుత్వంచే ఇవ్వబడిన CIF నిధులు సక్రమంగా ఉపయోగించుకొని ప్రతి ఇంటికి ఓక పారిశ్రామిక వేత్తగా మహిళలు తయారు అవ్వాలని చెప్పడం జరిగింది.అడ్మిన్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మహిళందరు PMFME, PMEGP వంటి పధకాలు ఉపయోగించుకొని, భాద్యతాయుతముగా ఉండేలా తిరిగి రికవరీ సక్రమంగా చేసేలా వారిని తయారు చెయ్యాలని APM, CC లకు చెప్పడం జరిగింది. అనంతరం కమ్యూనిటీ మేనేజ్డ్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించి VOA లకు జరుగుచున్న శిక్షణ కార్యక్రమం లో పాల్గొని వారికి తగు సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి,అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజాప్రతాప్,జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కోయ రజిని కుమారి, స్టేట్ ఆఫీస్ నుండి వాల్మీకి,శోభ, దాసు , DPMs, జిల్లాలోని అందరూ APMs, CCలు పాల్గొనడం జరిగింది.