నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, పాపాలను దాచిపెట్టేందుకు నాటకాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.నకిలీ మద్యం వ్యవహారంలో నిజమైన నిందితులు వైసీపీ నేతలేనని, ఇప్పుడు వారి పాపాలను కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
గత ఐదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాను నడిపి రూ.3500 కోట్లను దోచుకున్నారన్నారు.
జే-బ్రాండ్ల పేరుతో రాష్ట్ర ప్రజలకు అమ్మిన నాసిరకం మద్యానికి 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారన్నారు.చిత్తూరు జిల్లా ములకల చెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో కల్తీ మద్యం కేసులు కూడా వైసీపీ కుట్రలో భాగమేనన్నారు. సెప్టెంబర్ 24న ఆఫ్రికాకు వెళ్లే టికెట్ బుక్ చేసుకున్నా వ్యక్తిని ముందే పిలిపించి, కుట్ర పూర్వకంగా మద్యం కేసులో ఇరికించారని వివరించారు.జగన్ మోహన్ రెడ్డి, జోగి రమేష్, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి లాంటి నేతలు ఆఫ్రికాలో కూడా కల్తీ మద్యం వ్యాపారాలు నడిపారనే సాక్ష్యాలు ఉన్నాయన్నారు.
కామెరూన్ దేశంలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో కల్తీ మద్యం తయారీ కంపెనీ సీజ్ అయిన విషయం వాస్తవమని అదే మాఫియా నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ నడిపారన్నారు.డీకార్డ్ లాజిస్టిక్స్ అకౌంట్ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి రూ.5 కోట్ల ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు సిట్ నివేదిక వెల్లడించిందన్నారు.వైసీపీ మద్యం మాఫియాలో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు నిందితులుగా ఉన్నా, వారిని జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు.కూటమి ప్రభుత్వం పార్టీ నిబద్ధతను నిరూపిస్తూ కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరి పల్లి జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను టీడీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారని తెలిపారు.ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను ప్రారంభించి, కల్తీ మద్యం గుర్తించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారని వివరించారు.డిస్టిలరీలు, డిపోలు, బార్లలో ఆకస్మిక తనిఖీలు, ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు.
జగన్ పాలనలో 3 లక్షల బెల్ట్ షాపులు నడిపి రాష్ట్రాన్ని మద్యమయం చేశారని కూటమి ప్రభుత్వం బెల్ట్ షాపులను మూసి, బాధ్యులపై రూ.5 లక్షల జరిమానా విధించడం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
అలాగే, గతంలో విజయవాడలో వైసీపీ నేత మల్లాది విష్ణుకు చెందిన బార్‌లో కల్తీ మద్యం తాగి 6 మంది చనిపోయినా, జగన్ ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చాడని, ఆ నాయకుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కల్తీ మద్యం కుంభకోణంలో జగన్ తన దోపిడీని కప్పిపెట్టు కొనేందుకు కుట్ర నాటకం ఆడుతున్నారని రాష్ట్ర ప్రజలు వైసిపి ఆడే నాటకాలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఇప్పటికైనా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న కుట్రలు ఆపాలని హెచ్చరించారు.

