చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు.

 

నరసరావుపేట, అక్టోబర్ 22, 2025

(పల్నాడుఅప్డేట్స్ ):నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బుధవారం నరసరావుపేట మండలం అల్లూరు వారి పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగ్గమ్మ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చర్చి నిర్మాణానికి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి సీనియర్ నాయకులు పాల్గొని, కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.