లోతట్టు ప్రాంతాలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి.
పొలాల్లో నీరు నిల్వకుండా వ్యవసాయ అధికారులు చూడాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.
బాపట్ల,అక్టోబర్ 24(పల్నాడుఅప్డేట్స్):లోతట్టు ప్రాంతాలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హల్ నందు జిల్లా కురుస్తున్న వర్షాలకు సంబంధించి వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల రోడ్లు,చెరువు కట్టలు తెగిపోవడం జరిగిందని,గ్రామ పట్టణాల్లో ని లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి ఉండడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని,లోతట్టు ప్రాంతాలలో ఉన్న నీరును వెంటనే తొలిగించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లు,ఆర్డీఓలు మండలాల తహశీల్దార్లు,యం పి డి ఓ లను ఆదేశించారు.మండల వ్యవసాయ అధికారులు వారి పరిధిలో ఉన్న రైతులతో మాట్లాడి పొలాల్లో నిలిచి ఉన్న నీటిని తొలిగించే ఏర్పాట్లు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆదేశించారు. నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నియోజకవర్గాల ప్రత్యేక అధికారుల ను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్,బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డిపిఓ ప్రభాకర్ రావ్,డి యం & హెచ్ ఓ డాక్టర్ విజయమ్మ, డ్వామా పిడి విజయలక్ష్మి, సి పి ఓ. రాజు.వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

